ఆర్టీసీ బస్సులో హషీష్ ఆయిల్ రవాణా.

తేది:18-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

ముగ్గురు నిందితుల అరెస్ట్.. 2.1 కిలోల స్వాధీనం.

హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నేరగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో హషీష్ ఆయిల్ను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీ సులు నిందితులను పట్టుకుని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నా
నికి చెందిన కొర్ర ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన బింగు కార, రాజేష్ కార (అలియాస్ రాజయ్య కార)లు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పాడి కృష్ణారావు నుంచి హషీష్ ఆయిల్ సేకరించి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తరలించారు. ఎల్బీనగర్ మెట్రో సమీపంలో ఒక వ్యక్తికి ఈ మత్తు పదా ర్థాన్ని అందజేయడానికి ఎదురు చూస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 కిలోల 100 గ్రాముల హషీష్ ఆయిల్, మూ డు సెల్ఫోన్లు, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *