తేది:18-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మండల వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో శనివారం జనగణనను చేపట్టే సిబ్బందికి MRO కిరణ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనగణనను రెండు దశల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా మొదటి దశలో ఇళ్ల జాబితా, రెండో దశలో జనాభా లెక్కల సేకరణను చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఎన్యుమరేటర్స్, సూపర్వైజర్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RI తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.