నల్గొండలో రోడ్డు భద్రత & మిషన్ పరివర్తన్ అవగాహన కార్యక్రమం.

తేది:18-04-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.

నల్గొండ జిల్లా:నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడానికి భాగంగా “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం”ను పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా “Arrive Alive” కార్యక్రమం నాలుగో రోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ శ్రీ రాఘవరావు గారు, ఎస్ఐ శ్రీ సైదులు గారు నల్గొండ బస్టాండ్ ప్రాంతంలో సుమారు 400మంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆటో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
పోలీస్ అధికారులు మాట్లాడుతూ, చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం అత్యంత అవసరమని, వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఆటో డ్రైవర్లు విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *