తేది:18-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరమల్‌గూడా మాధవ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు స్థానిక నివాసి కోసికే వెంకటరమణ రెడ్డి (KVR)ని అరెస్ట్ చేయడానికి రావడంతో ఈ వివాదం చెలరేగింది.
విజయనగరం జిల్లా బాడంగి పోలీసుల బృందం హైదరాబాద్‌కు చేరుకుని, వెంకటరమణ రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, వెంకటరమణ రెడ్డిని కలవడానికి వచ్చిన బంధువులు, జర్నలిస్టుల మొబైల్ ఫోన్లు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని, ఎక్కువగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని సమాచారం. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మరియు స్థానిక జర్నలిస్టులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం, ఈ నెల 19న పోలీస్ స్టేషన్‌కు హాజరై వివరణ ఇవ్వాలని BNSS 35(3) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.