తేది:19-4-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : అత్తాపూర్‌కు చెందిన రాజేంద్రనగర్ డివిజన్ RDOపై కోర్టు ధిక్కరణ కేసులో కఠిన చర్యలు తీసుకుంది.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న RDOకు కోర్టు ధిక్కరణ కింద నెలరోజుల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.
పెద్ద షాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 172–183లో ఉన్న సుమారు 74 ఎకరాల సీలింగ్ భూమి వివాదానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడంలో ఆలస్యం జరిగిందని యూసుఫుద్దీన్ అనే వ్యక్తి Telangana High Courtలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తాను ఇచ్చిన గడువులోపు ఉత్తర్వులు జారీ చేయకపోవడం కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించినట్టేనని నిర్ధారించి, RDOపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంది.
అదే సమయంలో, విధించిన జరిమానాను చెల్లించకపోతే ఇంకా రెండు వారాల జైలు శిక్ష పెంచుతామని కోర్టు స్పష్టం చేసింది.అలాగే, RDOకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది.