తేది:17-04-2026 కరీంనగర్ జిల్లా TSLAWNEWS కరీంనగర్ రూరల్ రిపోర్టర్ సముద్రాల అనిల్ కుమార్.
కరీంనగర్ జిల్లా:ఈరోజు విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య గారి ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల నూతన తహసిల్దార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలాసాగర్ ఉపసర్పంచ్ పోత్తూరీ శైలజ, వార్డు సభ్యులు సుంకపాకహేమలత, అనిల్, జోగు శంకర్, బోయిన్పల్లి మండలం ఏఎంసి డైరెక్టర్ కన్నెపెళ్ళి సతీష్ మరియు టీఎస్ లా న్యూస్ జిల్లా ఇన్చార్జ్ దొబ్బల ప్రసాద్ గార్లు పాల్గొన్నారు.