వక్ఫ్ చట్టం సవరణ పై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..

లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా దీనిని తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయనున్నది కేంద్రం ప్రభుత్వం. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో సుమారుగా 40 సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. బిల్లును తామును వ్యతిరేకిస్తున్న చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. అందుకే మేం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి చేస్తున్నారు. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తది’ అంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఈ నిర్ణయం సరికాదంటూ కూడా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *