రోజూ రోజుకు తగ్గుతున్న బీజేపీ గ్రాఫ్..? ఇలా అయితే కష్టమే..?

8 ఎంపీ సీట్లు.. 8 మంది ఎమ్మెల్యేలు. ఇది తెలంగాణలో బీజేపీ ట్రాక్ రికార్డ్.. రోజురోజుకు పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్‌ బీజేపీకి ఓ అవకాశం.. మరి ఆ అవకాశాన్ని బీజేపీ ఏ మేర అందిపుచ్చుకుంటుంది? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ జీరో అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలోనే కల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఎంతలా అంటే ఉన్న ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్‌కు హాజరుకాలేనంత.. ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతుంది?

 

భవిష్యత్‌ ఎన్నికలు, పార్టీ విస్తరణ.. ఈ అజెండాతో బీజేపీ ఓ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. ఈ మీటింగ్‌లో పార్టీ ఫ్యూచర్‌ పరిస్థితేంటో కానీ.. ప్రసెంట్ అయితే ఏం బాగా లేదని తెలుస్తోంది. ఈ మీటింగ్‌కి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డితో పాటు ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటెండ్ అయ్యింది ఒకే ఒక్కరు. ఆయనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త.. అటు ఎమ్మెల్యేలు రాలేదు.. ఎమ్మెల్సీలూ రాలేదు. దీంతో మరోసారి ప్రచారం మొదలైంది. పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ పెరిగింది అని.. మరి జరుగుతుంది కదా.. పార్టీ పెద్దలంతా వచ్చి.. నేతలు రాకపోతే..

 

మరి మీటింగ్‌కు ఎందుకు రాలేదు అంటే.. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్.. పార్టీ ఆఫీస్‌కు కూత వేటు.. అంటే పిలిస్తే పలికేంత దూరంటో ఉండే రాజాసింగ్ కూడా.. పార్టీ ఆఫీస్‌ మొఖం చూడలేదు. చాలా రోజులుగా పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఓ రకమైన అలక కనిపిస్తోంది. పార్టీ యాక్టివిటీస్‌లో తమను ఇన్‌వాల్వ్‌ చేయడం లేదని. అందుకే ఈ మీటింగ్‌కు లైట్‌ తీసుకున్నారనేది టాక్. నిజానికి తెలంగాణలో గతంలో కంటే మంచి పోజిషన్‌లో ఉంది. దానిని మరింత మెరుగుపరుచుకునే చాన్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ టైమ్‌లో లీడర్సంతా కలిసికట్టగా ఎన్నికలకు రెడీ కావాలి. కానీ ఆ పరిస్థితులు లేవు. హైకమాండ్ కూడా ఇవన్నింటిని పరిశీలిస్తూనే ఉంది. అందుకే ఇలాగైతే కష్టమన్న భావనకు వచ్చినట్టుంది. అందుకే నేరుగా బీఎల్ సంతోష్‌తో పాటు మరికొంత మంది అ్రగ నేతలు ల్యాండ్ ఆయ్యారు.

 

పార్టీ కార్యక్రమాల్లో ఏం జరుగుతుంది? అంతర్గత వ్యవహారాల్లో ఏం జరుగుతుంది? ఇలా అన్ని అంశాలపై కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్స్ అందాలి. కానీ అలా జరగడం లేదనేది కమలనాథుల సర్కిల్స్‌లోనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అధ్యక్ష బాధ్యతల మార్పు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. అయితే 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అసలు టార్గెట్‌ అని తెలుస్తోంది.

 

హైకమాండ్ దూరదృష్టితో ఉంటే.. లోకల్ నేతలు మాత్రం పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. మీకు మీరే.. మాకు మేమే అనే తీరు అర్ధవంతంగా కనిపిస్తోంది. అధ్యక్ష పదవి కోసం రెండుగా చిలీపోయారు నేతలు. కొత్త, పాత అంటూ రెండు గ్రూప్‌లు కట్టేశారు.. మరి అసలు పరిస్థితేమో ఇలా ఉంది. పార్టీ పెద్దలేమో భారీ ఆశలతో వస్తున్నారు. ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నేతలను చక్కదిద్దకపోతే పరిస్థితులు మెరుగవ్వడం పక్కన పెడితే.. మరింత దిగజారడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *