గజరాజుల శాపమే వయనాడ్ కు దుస్థితికి కారణమా..?

వయనాడ్ లో భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. మూడు గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అరుదైన వృక్షాలు కనుమరుగయ్యాయి. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. ఇప్పటి వరకూ 413 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సర్వీసులతో పాటు.. వాలంటీర్లు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

 

వయనాడ్ జిల్లాలో జరిగిన ఈ ప్రకృతి విధ్వంసంలో చురల్ మల, వెలరిమల, ముండకయిల్, పుంచిరిమట్టం గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది మరణించారు. వేసవి విడిదికే కాదు.. వర్షాకాలంలోనూ ఎంతో అందంగా కనిపించే వయనాడ్ కు ఎందుకింత కష్టం వచ్చింది ? అనే ప్రశ్నకు ఇప్పుడొక సమాధానం వినిపిస్తోంది. గజరాజుల శాపమే వయనాడ్ కు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

2020 జూన్ 3న కేరళలోని నీలంబూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక గర్భిణీ ఏనుగును.. కొందరు గ్రామస్తులు అనాసపండులో పేలుడు పదార్థాలను పెట్టి తినిపించి చంపిన ఘటన వెలుగుచూసింది. ఆ బాంబు పేలడంతో ఆ ఏనుగు తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. సుమారుగా 14-15 సంవత్సరాల వయసున్న ఆ ఏనుగు.. పోస్టుమార్టం చేస్తుండగా గర్భంతో ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

 

మలబార్ తీరంలోని వెల్లియార్ నదిలో చాలారోజులుగా చిక్కుకుపోయి ఉన్న ఏనుగుపట్ల రోజులు చిక్కుకుపోయింది. దానిని నది నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించేందుకు ప్రయత్నించినా.. అధికారుల ప్రయత్నం ఫలించలేదు. తొండంతో సహా నీటిలో కూరుకుపోవడంతో.. దానికి ఎక్కడ గాయమైందో కూడా అర్థంకాని పరిస్థితి. అయితే రెండు దవడలకు గాయాలవ్వడంతో దాని దంతాలు విరిగినట్లు మాత్రం గుర్తించారు.

 

సరిగ్గా నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఇప్పుడు వయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయానికి ఆనాడు గర్భిణి ఏనుగును బాంబు పెట్టి చంపడమేనని అంటున్నారు నెటిజన్లు. గజరాజుల శాపమే వయనాడ్ ను వెంటాడిందంటూ పోస్టులు పెడుతుండటంతో.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *