గన్నవరం నుంచి త్వరలోనే మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. విజయవాడ – ముంబై విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడారు. గన్నవరం నుంచి ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులు ప్రారంభించాం అని తెలిపారు.
విమానం ముంబైలో మధ్యాహ్నం 3.57 గంటలకు బయలు దేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి 9.00 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుందని అన్నారు. సమీప ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్‌లో విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు విస్తరిస్తామని చెప్పారు.
గన్నవరం నుంచి కోల్‌కతాకు వైజాగ్ మీదుగా విమాన సర్వీసులు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం అని అన్నారు. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం అని తెలిపారు. థాయ్‌లాండ్, శ్రీలంక సర్వీసులు తీసుకొచ్చేందుకు .. ఢిల్లీ నుంచి అదనంగా మరో రెండు సర్వీసులు నడిపేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. గుత్తేదారు వల్ల కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమైందని దానిని త్వరలోనే పూర్తి చేస్తాం అని వివరించారు.