రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ సందడి..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో తీసుకొస్తున్నారు. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగ్ సూసేకి అగ్గి రవ్వ.. సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తాజాగా, హైదరాబాద్‌లో కీలక సీన్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

కీలక సీన్లు

పుష్ప సినిమాతో అలరించిన పుష్పరాజ్.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పుష్ప 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో పాటు పలు కీలక సీన్లను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో పాటు ఇతర పాత్రధారులపై ఈ సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడది పురస్కారం వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *