అర్జున అవార్డుకు మనికా బాత్ర
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు బంగారం పతకం అందించిన మనికా బాత్రాకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ) సిఫారసు చేసింది. గోల్డ్ కోస్ట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన మనికాను అర్జున అవార్డుకు నామినేషన్ పంపినట్టు టీటీఎఫ్ఐ అధికారి ఒకరు తెలిపారు. ఆమెకు అర్జున అవార్డు దాదాపు ఖాయమని, ప్రభుత్వం ఆమెను విస్మరించలేదని ఆయన పేర్కొన్నారు.
గోల్డ్‌కోస్ట్‌లో క్రీడల్లో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించడం ద్వారా మనికా రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంటులో 22 ఏళ్ల మనికా సింగపూర్‌కు చెందిన వరల్డ్ నంబరు 4, మూడుసార్లు ఒలింపియన్ అయిన ఫెంగ్ తియన్‌వీని రెండుసార్లు ఓడించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు అందించిన జట్టులో సభ్యుడైన హర్మీత్ దేశాయ్‌ని కూడా టీటీఎఫ్ఐ అర్జున్ అవార్డుకు సిఫారసు చేసింది.