ఉత్సాహంగా వేసవి శిక్షణ శిబిరాలు
వేసవి శిక్షణ శిబిరాలు ఊపందుకున్నాయి. సెలవులను సద్వినియోగం చేసుకుంటూ.. తమకిష్టమైన ఆటలో మెళకువలు నేర్చుకోవడానికి పిల్లలు మైదానాల బాట పట్టారు. జింఖానాతో సహా వివిధ మైదానాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలు క్రీడాకారులతో నిండిపోయాయి. బాస్కెట్బాల్, వాలీబాల్, బాక్సింగ్ తదితర క్రీడల్లో శిక్షణ తీసుకుంటూ కనిపిస్తున్నారు.