పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు
కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం.. నచ్చిన సంస్థకు ఆ ప్రాజెక్టుని అప్పగించడం.. జీవీఎంసీ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కట్టబెట్టడం. గత మూడేళ్లుగా ఇదే తంతు. ఇలాగైతే.. కార్పొరేషన్ పుట్టి మునిగిపోవడం ఖాయం. చివరికి ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలంటే ఒక్క రూపాయీ మిగలదేమో..!
– ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి..
ఆయన మాటల్లో కించిత్తయినా అవాస్తవం లేదు. ప్రస్తుతం జీవీఎంసీలో జరుగుతున్న తీరును పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసా పైసా కూడబెట్టుకొని మహా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల పాలవుతోంది. స్మార్ట్ సిటీ, అమృత్ నగరమంటూ ప్రకటించి.. పప్పుబెల్లాలు చేతికిచ్చి మిగిలిన సొమ్ము పెట్టుబడి పెట్టి చేస్తున్న ప్రాజెక్టులు ఖజానాను ఊడ్చేస్తున్నాయి. తాజాగా.. హైబ్రిడ్ సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్టు కూడా అదే కోవలోకి వస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న నగరంపై అదనంగా రూ.150 కోట్ల భారం వేస్తోంది.
విశాఖ సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థకు కొత్త ప్రాజెక్టులు తలబొప్పి కట్టిస్తున్నాయి. అరకొర నిధులు మంజూరు చేసి మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్ భరించుకొని పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలను ఆధునికీకరణ, స్వచ్ఛత పేరుతో స్మార్ట్‌సిటీ, అమృత్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీధులు సర్వాంగ సుందరంగా, నగరంలోని ఓ ప్రాంతం సాంకేతిక రూపు సంతరించుకునేలా స్మార్ట్‌సిటీ, నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాల పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్
– ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి..