కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఎంపీటీసీ ,జెడ్పిటిసి పోటీ చేయు అభ్యర్థులకు ఏలాంటి అనుమతి లేదని ఎస్సై వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న క్రమంలో అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు ఊరేగింపులు డప్పులు స్పీకర్లు డీజే లకు ఎటువంటి అనుమతి లేదని కలెక్టర్ ,కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ నుండి ఆదేశాలు ఉన్నందున అభ్యర్థులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.ఒకవేళ ర్యాలీలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రశాంతవాతావరణంలో నామినేషన్లు జరుపుకోవాలని ఆయన కోరారు.
