ఓపెన్ స్కూల్ పరీక్షలో విద్యార్థి డిబార్

ఈరోజు కల్వకుర్తి యందు జరుగుతున్న తెలంగాణ  ఓపెన్ స్కూల్ పరీక్షలో ఇంటర్లో ఒక విద్యార్థి డిబార్,  పదో తరగతిలో ఒక విద్యార్థి డిబార్, ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుండి తప్పించిన – డీఈవో గోవిందరాజులు

ఈరోజు  కల్వకుర్తి యందు జరుగుతున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని, మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు పదోతరగతి, తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు 2 పరీక్ష కేంద్రాలను సందర్శించిన నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి యం.గోవిందరాజులు,ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి చూచి రాతలకు పాల్పడుతున్నందుకు డిబార్ చేశారు. అలాగే పరీక్షల విధులు సరిగా నిర్వర్తించంనందుకు ఒక ఉపాధ్యాయుడిని పరీక్షల విధుల నుండి విడుదల చేశారు.
10వ తరగతి పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి చూచి రాతలకు పాల్పడుతున్నందుకు డిబార్ చేశారు. అలాగే పరీక్షల విధులు సరిగా నిర్వర్తించంనందుకు ఒక ఉపాధ్యాయుడిని పరీక్షల విధుల నుండి విడుదల చేశారు.
కల్వకుర్తి లో ఇద్దరు విద్యార్థుల డిబార్, ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్ష విధుల నుండి డిఇవో తప్పించారు.
 10వ తరగతి పరీక్షకు 281 మంది విద్యార్థుల గాను 249 మంది విద్యార్థులు ఓపెన్ పరీక్షలకు హాజరు కాగా, 32 మంది విద్యార్థులు పదవ తరగతిబ పరీక్షలకు గైర్హాజరయ్యారు.
ఇంటర్ పరీక్షకు 85 మంది విద్యార్థులకు గాను 74 మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా 11 మంది విద్యార్థులు నేటి ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి చూచి రాతలకు తావులేకుండా నిర్వహించాలని డిఇవో చీఫ్ సూపరింటెండెంట్లును ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *