పరస్తూ అహ్మది (29) అనే ఈ యువ గాయనికి సంగీతంపై ఉన్న ఆసక్తితో ఓ ప్రత్యేక సంగీత ప్రదర్శనను రూపొందించారు. 2024 డిసెంబర్లో ఓ పురాతన భవన సముదాయంలో చిత్రీకరించిన ఈ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో ఆమె పొడవాటి గౌను ధరించి, తలపై హిజాబ్ లేకుండా పాట పాడారు. ఆమెతో పాటు నలుగురు సంగీత కళాకారులు కూడా పాల్గొన్నారు. ప్రేక్షకులు లేకుండానే చిత్రీకరించిన ఈ వీడియో కొద్ది రోజుల్లోనే వైరల్గా మారి లక్షలాది మంది వీక్షణలను సొంతం చేసుకుంది.
అయితే, ఈ వీడియో ఇరాన్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. హిజాబ్ లేకుండా బహిరంగంగా పాట పాడటంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించారు. తాజాగా ఈ శిక్ష అమలైనట్లు న్యాయవాది వెల్లడించడంతో ఇరాన్లో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, కళాత్మక వ్యక్తీకరణపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.