ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి మోటో ప్యాడ్ 70 (Moto Pad 70) పేరుతో కొత్త 5G ట్యాబ్లెట్‌ను తీసుకురానుంది. ఈ ట్యాబ్లెట్ వచ్చే నెల ఆగస్టు 9న లాంచ్ కానున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ప్యాడ్ 70కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ట్యాబ్లెట్ ప్రధాన ఫీచర్లు, డిజైన్, ఇతర విశేషాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ డివైస్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
ప్రీమియం ఫీచర్లతో రానున్న ఈ 5G ట్యాబ్లెట్ పనితీరు, మల్టీమీడియా అనుభవాన్ని మెరుగుపరిచేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు వంటి వివరాలు ఆగస్టు 9న జరిగే లాంచ్ కార్యక్రమంలో వెల్లడికానున్నాయి.