మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ప్రగడ శ్రీనివాసులు మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి (డివైఈఓ)గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్దారవీడు మండలంలో ప్రగడ శ్రీనివాసులు విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం విశేష కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు, ఉపాధ్యాయుల సమన్వయం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
అలాగే ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలులో చురుకుగా వ్యవహరిస్తూ, పాఠశాలల తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా తీసుకున్న చర్యల ఫలితంగానే ఆయనకు ఈ పదోన్నతి లభించిందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.