హోంమంత్రి అనితపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ఎంఆర్పీఎస్

గోకవరం మండలంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎంఆర్పీఎస్ మండల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా స్థానికంగా నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంఎస్పీ మండల అధ్యక్షులు గరభారపు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

అలాగే ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు చాపల సూరిబాబు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులపై గౌరవప్రదమైన భాషలోనే మాట్లాడాలని సూచించారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను నివారించాలని కోరారు.