కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సివిల్ జడ్జి.

తేది:25-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. తదనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *