మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్-మర మనిషి మాటను కవిత ఉప సంహ రించుకోవాలి.

తేది:25-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి.

జగిత్యాల జిల్లా: మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్.మర మనిషి మాటను కవిత ఉప సంహ రించుకోవాలి.రాష్ట్రానికి పట్టిన పీడ, శని నీ తొలగించేందుకు ఉద్యమించాలని హితవు.
జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆయన స్వగృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు
మాజీ ఎమ్మెల్యే కవిత పార్టీ ఏర్పాటు సందర్భంగా.
కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదు.2001 లో కెసిఆర్ ఎమ్మెల్యేగా ,డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ ఎస్ పార్టీ నీ స్థాపించి సమాజాన్ని జాగృతం చేసి, అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించారు,కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది.కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు.
బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు.కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు.కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదు.
కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు.కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి, ఆర్ డి ఎస్ తోపాటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను ఊహించలేదు.ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేని పరిస్థితిలో
ప్రాణహిత నది జలాల వినియోగం మేడిగడ్డ,అన్నారం, సుందిల్ల బ్యారేజ్ తో రాష్ట్రవ్యాప్తంగా నీరు సరఫరాకు మార్గం సుగమం అయింది .సింగూరు కు కూడా నది జలాలను తరిలించుకోలగలుగులుగుతూన్నం వరద కాలువ ద్వారా ఎస్ ఆర్ ఎస్పీ సుమారు 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీరు అందిస్తుంది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా 90 శాతం పూర్తి అయింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వయంగా భారత ప్రధాని తో ప్రశంసలు పొందడంతో కూడా, జాతీయ బ్యాంకు ల సాయంతో నిర్మాణం జరిగింది.
కేవలం కేసీఆర్ ను దోషిగా ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా రెండు పిల్లర్లు కుంగితే మరమత్తులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు.వర్షాభావంతో కరువు ఏర్పడితే రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి.
కవిత ఐదు ప్రకటించారు. వాటిలో ప్రత్యేకత ఏముంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ విద్యాకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఉచిత విద్యా కల్పించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఎస్సీ, ఎస్టీలకు గురుకులాల ఏర్పాటు చేశారు.ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు.మన ఊరు మన బడి రూపొందించి
ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధన చేపట్టారు.ప్రతి జిల్లా కో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు
ఉచిత కంటి పరీక్షలు చేసి, కళ్లజోళ్లు పంపిణీ చేశారు.
మీరూ కొత్తగ ఏం చెప్పారు.
రైతు బంధు పేరిట ఎవరైనా ఉచితంగా పెట్టుబడి సాయం అందజేస్తామని ఊహించ లేదు.
రైతు కుటుంబాల్లో రైతు బీమా తో ఆత్మస్థైర్యం నింపారు.
పొరుగు రాష్ట్రం రైతులకు ఆదుకునేందుకు సాయం చేయడం తప్పా.
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తే, 24 గంటలు ఉచిత విద్యుత్ అందజేశారు.
విద్యుత్ సమస్యలు తలెత్తకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ తో కల్సి ప్రయాణం చేసి, ఆయన ఉద్యమ స్పూర్తి తో నాయకురాలిగా ఎదిగి,తప్పు పట్టడం సరికాదు.
తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనీ కేసీఆర్ తపన పడుతున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి రైతు భరోసా 15 వేలు అందిస్తామని, తులం బంగారం ఇస్తామని, అమలు చేయడం లేదు.
కేటీఆర్ ఐటీ మంత్రిగా హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కృషి చేశారు.
కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్ కు దిక్కు లేదు.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినవాళ్ళు దిక్కులేదు..కేవలం 17 వేల ఉద్యోగాలు భర్తి చేశారు.
కవిత 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు.
ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ కు ఉన్న నిబద్ధత ఎవరికి లేదు..
ఎస్టీలకు కేంద్రానికి సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్ పెంచారు.
రాష్ట్రంలో సుస్థిర శాంతి భద్రతలు రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల జీవన స్థితిగతులు పరిశీలించాలని పారదర్శకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.
సమగ్ర కుటుంబ సర్వేలో మైనారిటీలు కాకుండా బీ సి లు 51 శాతం వస్తె, రేవంత్ రెడ్డి సర్వే లో 46 శాతానికి వచ్చింది.
ఇదేనా మీ సామాజిక న్యాయం.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై నీ లక్ష్యం ఉండాల్సి ఉండగా.పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఆర్టిషన్ ఉద్యమించిన పట్టించుకోవట్లేదు.
బీ ఆర్ ఎస్ ప్రతి ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ సూచన కు అనుగుణంగా జరుగుతున్నది.
కేసీఆర్ సూచనల మేరకు కేటీ ఆర్, హరీష్ రావు, బీ ఆర్ ఎస్ నాయకులు అందరూ హైడ్రా ను నిలువరించేందుకు కృషి చేస్తున్నారు.
ముసి సుందరీకరణ నెపంతో నిరుపేదల ఇళ్ళు కూలగొడుతుంటే కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఆయన సూచనలతో నిర్వాసితులకు అండగా నిలుస్తున్నారు.
పొంగులేటి రాఘవ ఆక్రమణలు నిలువరించేలా ఒక్క మాటా మాట్లాడినవా అని కవితను నిలదీశారు.
కేసీఆర్ గురించి మాట్లాడతావా..
రేవంత్ రెడ్డి గురించి కేవలం ఒక్క మాట మాట్లాడింది..
మొత్తం కేసీఆర్, బీ ఆర్ ఎస్ పార్టీ మీద మాట్లాడింది.
బీ.ఆర్.ఎస్ ను నిలువరింప చేయడం నీ తో కాదు.ఎవరితో కాదు.
రేవంత్ రెడ్డి ఆలోచనకు రూప కల్పనలు అనుగుణంగా బీ టీమ్ రంగంలోకి దించుతున్నారూ అని భావించాల్సి వస్తోంది.
రాష్ట్రానికి పట్టిన పీడా శని తొలగించేల రేవంత్ రెడ్డిని గద్దె దించేలా ఉద్యమం చేయి..
బీ ఆర్ ఎస్ పార్టీ కి శాపనార్ధాలు పెట్టుడు మానుకో.
ఆర్ టి సి కి నిధులు సక్రమంగా ఇస్తే డ్రైవర్ శంకర్ గౌడ్ బలి అయ్యేవాడు కాదు..
ఫీజు రీయింబర్స్ పై కోర్టు ప్రభుత్వనికి మొట్టికాయలు వేసింది.
సింగిల్ విండో ఎన్నికలు నామినేట్ చేస్తామంటున్నారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు లేకుండా నామినేట్ చేయొచ్చా అని ఆలోచిస్తారేమో అని ఎద్దేవా చేశారు
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్, మర మనిషి అనే మాట సరైంది కాదు.. ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని కవితకు జీవన్ రెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *