తేది: 26-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా : మల్యాల మండల కేంద్రంలో ఓ లేగదూడకు బారసాల వేడుకను యజమాని జనగాం వెంకటేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తమ ఇంట్లోని ఆవుకు జన్మించిన దూడకు 21 రోజులు నిండటంతో.. పూలు, నూతన వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసి ‘సిద్ధమ్మ’గా నామకరణం చేశారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం బంధుమిత్రులకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మూగజీవంపై ఉన్న మమకారాన్ని చాటుకున్న తీరు స్థానికులను ఆకట్టుకుంది.