కొండగట్టు అంజన్న క్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

తేది: 22-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: కొండగట్టు అంజన్న ఆలయంలో మే 11 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్న పెద్ద జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లును బుధవారం జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. అంజన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని ఆలయ ఈఓ అంజనారెడ్డి ని కోరారు. అనంతరం వారు అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. వారి వెంట స్థానిక సిఐ నీలం రవి, ఎసై నరేష్ ,ఇంచార్జి డీఈ రఘునందన్ ,ఏఈఓ హరిహర నాథ్ ,సూపరిండేంట్ లు సునీల్, చంద్రశేఖర్ లతో పాటుగా, స్థానాచారి కపిందర్ ,ఉపప్రధాన అర్చక చిరంజీవి స్వామిలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *