తేది: 22-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రామ మందిర నిర్మాణానికి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున నిధులను అందజేస్తూ నిర్మాణానికి తోడ్పాటునందిస్తున్నారు. నిధి సేకరణలో భాగంగా నేటితో 9 రోజులు పూర్తి చేసుకోగా, ఇప్పటివరకు సుమారు రూ. 40 లక్షల వరకు నిధులు సమకూరినట్లు నిర్మాణ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో బుధవారం గ్రామానికి చెందిన నల్ల సంజీవ్ రూ. 3 లక్షల విరాళాన్ని కమిటీకి అందజేసి తన దైవభక్తిని చాటుకున్నారు.