తేది:22-04-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా: Crime No.166/2026 U/S 95,108 BNS of P.S.Nalgonda II town
భార్యను తీవ్ర మానసిక మునుగోడు మండలములోని సింగారం గ్రామానికి చెందిన గుంటుక సత్తయ్య చిన్న కూతురు అయిన శ్వేత, వయస్సు.32 సంవత్సరములు కు తేధి 28-04-2022 నకిరేకల్ మండలములోని మంగలపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల రవితేజ తో వివాహము జరిగినధి. వారికి ఒక కూతురు విద్యాదరి, 4 సంవత్సరములు, ఒక కొడుకు ఆయాన్శు, 2 సంవత్సరములు సంతానము కలరు. గత కొద్ది రోజుల నుండి శ్వేత యొక్క భర్త అయిన పెరుమాళ్ల రవితేజ త్రాగుడుకు అలవాటు పడి భార్యను మానసికంగా వేదిస్తుండగా ఆమె అతని వేధింపులు తట్టుకోలేక తేధి 14-04-2026 రోజున నల్లగొండ కు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎలుకల మoధు త్రాగి అపస్మారక స్థితిలో వుండగా ఆమెను చికిత్స గురించి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ లోని పవన్ సాయి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుచూ తేధి 17-04-2026 రోజున ఉదయము 11.00 గంటలకు చని పోయినధి. మృతురాలి అన్న అయిన గుంటుక శాంతి కుమార్ నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో ఇచ్చిన పిర్యాధు మేరకు మృతురాలి భర్త అయిన పెరుమాళ్ల రవితేజ మీధ నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు కేసు నమోధు పర్చనైనధి.
ఈ రోజు అనగా తేధి 22-04-2026 రోజున ఊదయము 10.00 గంటల సమయములో నేరస్థుడు పెరుమాళ్ల రవితేజ ను నల్లగొండ RTC బస్ స్టాండ్ వద్ధ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తీసుకు రావడము జరిగినధి. అతన్ని గౌరవ కోర్టు కు రిమాండ్ నిమిత్తము పంపబడును.