పర్యావరణ పరిరక్షణకు చేయూతగా వాసవి ఆలయానికి స్టీల్ సామగ్రి విరాళం.

తేది :20-04-2026 TSLAW NEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా : రాయికల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంకు ఇటిక్యాల వాస్తవ్యులు, కీర్తిశేషులు చౌడారపు భూమయ్య –కిష్టూబాయి జ్ఞాపకార్థం వారి మనుమలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టీల్ సామగ్రిని తేది:19-04-2026 నాడు విరాళంగా అందజేశారు.

దేవాలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత చర్యలను ప్రోత్సహించేందుకు 100 స్టీల్ ప్లేట్లు , 50 స్టీల్ గ్లాసులు, 3 స్టీల్ టేబుళ్లు,1 బీరువాను సమర్పించారు.ఈ సందర్భంగా చౌడారపు రాజు–గంగాభవాని, చౌడారపు శ్రీధర్–అపర్ణ, చౌడారపు చంద్రశేఖర్–శ్వేత, చౌడారపు కిరణ్–పావని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, సమాజ సేవతో పాటు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు.

దేవాలయ కమిటీ సభ్యులు దాతలను అభినందించి, వారి సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *