తేది: 18-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా : మల్యాల మండల కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నారు. నిధుల సేకరణను ప్రారంభించి నేటితో 6 రోజులు పూర్తి చేసుకోగా ఇప్పటివరకు సుమారు రూ. 10 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన భూక్య రాజేందర్, నూతనంగా నిర్మించే ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి శనివారం తమ వంతుగా రూ. 2,01,116 అందజేయడం విశేషం.