తేది:18-04-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి
నల్గొండ జిల్లా: నల్గొండ లొ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారి మార్గదర్శకంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
నల్గొండ జిల్లా “జీరో ఎన్ఫోర్స్మెంట్” విధానాన్ని అనుసరించి, ఎలాంటి జరిమానాలు విధించకుండా వాహనదారులకు కేవలం అవగాహన కల్పించడం జరిగింది. టూ-వీలర్ మరియు ఫోర్-వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టంగా తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్న వాహనదారులను ప్రోత్సహిస్తూ, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించిన వారికి వేద డాన్స్ అకాడమీ సహకారంతో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా పోలీసులు తెలిపారు.