మామ వేధింపులకు గురై వివాహిత ఆత్మహత్య.

తేది:20-04-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.

నల్గొండ జిల్లా: నాంపల్లి మండలములోని మహ్మదాపురం గ్రామానికి చెందిన చింతల వెంకటయ్య పెద్ద కూతురు అయిన ఐశ్వర్య, వయస్సు.20 సంవత్సరములు కు సుమారు 5 నెలల క్రితము పానగల్లు కు చెందిన వర్రే శివ శంకర్ తో వివాహము అయినధి. ఆమె పెండ్లి అయిన తర్వాత ఆమెను ఆమె భర్త లేని సమయములో ఆమె మామ అయిన వర్రే లింగయ్య శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఆమెను ప్రతి చిన్న విషయానికి వేదిస్తూ ఆమెను తప్పు పడుతూ ఆమెతో, నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది నువ్వు చావమని ఆమెను వేదిస్తుండగా అట్టి ఐశ్వర్య ఆమె యొక్క మామ వర్రే లింగయ్య వేధింపులు తాళలేక నిన్న అనగా తేధి 18-04-2026 రోజున మధ్యాహ్నము 1 గంట సమయములో పానగల్లు లోని తన ఇంటిలో ఫ్యాన్ కు చీరతో ఊరి వేసుకుని చని పోయినధి. మృతురాలి తండ్రి అయిన చింతల వెంకటయ్య పిర్యాధు మేరకు మృతురాలి మామ అయిన వర్రే లింగయ్య మీధ కేసు నమోధు పర్చనైనధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *