తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. కవిత ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేసుకోవడం బీఆర్ఎస్ నేతలకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా ఆమె విసిరిన అస్త్రాలు నేరుగా బీఆర్ఎస్‌ను తాకాయి.. తాకుతున్నాయి కూడా. పరిస్థితి గమనించిన కేటీఆర్, రంగంలోకి దిగేశారు. దిద్దుబాటు చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు.
బీఆర్ఎస్‌కు చెమటలు పట్టిస్తున్న కవిత
టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరి వంశం కానుంది? కవితకు దక్కుతుందా? కేటీఆర్‌కు వైపు వెళ్లనుందా? దీనిపై తెలంగాణలో ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసినవారు రాణిస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే.
ఏప్రిల్ మూడున మీడియా ముందుకొచ్చిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పేరుతో కొత్త జెండాతో తాము రాజకీయాల్లోకి వస్తున్నామంటూ ఓ ప్రకటన చేశారు. అంతేకాదు టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అందరికీ అందుబాటు ఉందని, ఆ పేరును ఎవరైనా వినియోగించుకోవచ్చని వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో తీవ్ర కలకలం రేపాయి.
రంగంలోకి దిగిన కేటీఆర్.. ఆపై ప్రకటన
కవిత మాటలపై బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర చర్చ జరిగింది. టీఆర్ఎస్ పేరు కవిత బరిలోకి దిగితే తమకు ఇబ్బందులు తప్పవని, టీఆర్ఎస్ పేరు తమ సొంతమని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించారు. టీఆర్ఎస్‌గా ఉన్నప్పుడు పార్టీకి అన్నివిధాలుగా బాగుందని, బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కష్టాలు రెట్టింపు అయ్యాయని చెప్పుకొచ్చారు.
దీనిపై బీఆర్ఎస్ హైకమాండ్ తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని భావించి నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు కేటీఆర్.
పార్టీ పేరు మారాక నష్టపోయామని వ్యాఖ్యానించారు. గడిచిన రెండేళ్లు ఆ తరహా మాటలు ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ బహిరంగంగా చెప్పిన సందర్భాలు లేవు. తొలిసారి కేటీఆర్ వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాడుకలో ఉన్న టీఆర్ఎస్ ఎవరి సొంతమవుతుంది? కవిత.. ఆ పేరును దక్కించుకుంటారా? లేక కేటీఆర్ వశమవుతుందా?
మొత్తానికి ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ పెట్టకముందు కవిత ఇంత దూకుడుగా ఉంటే.. పార్టీ ప్రారంభించిన తర్వాత ఇంకెంత దూకుడుగా ఉంటుందేమోనని చర్చించుకుంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆలోచన్ సూపర్ హిట్ అని అంటున్నవాళ్లు లేకపోలేదు.