డబ్బా గ్రామంలో పాత, కొత్త తరాన్ని ఒక్కటిచేసిన క్రీడా జోష్.

తేది:12-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో కీర్తిశేషులు కోటి బుచ్చన్న నర్సు జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ గ్రామంలో క్రీడా ఉత్సాహాన్ని నింపింది బీసీ విద్యార్థి యువ నాయకుడు కోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు శారీరక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, యువతలో స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన జట్లకు బహుమతులు అందజేశారు. ముఖ్యంగా పాత తరం, కొత్త తరం క్రీడాకారులు కలిసి మైదానంలో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్ మాజీ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్ యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *