తేది:12-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలో త్రిశూల్ యూత్ జట్టు విజయం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఎస్ ఆర్ ఆర్ స్ట్రైకర్ జట్టుపై త్రిశూల్ యూత్ జట్టు విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. విజయం సాధించిన జట్టుకు నిర్వాహకులు భూక్య రాజేందర్ నగదు పారితోషికంతో పాటు, ట్రోఫీని అందజేశారు. ఈ ట్రోఫీలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 11,111 అందజేయగా, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 5,555 నిర్వాహకులు అందజేశారు.