తేది :10-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్ .
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం మైతాపూర్లో ప్రధానోపాధ్యా యుడు మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక పదవ తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ హెచ్ఎంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో గ్రామస్థులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.