సీఐ జానీ,మహిళా ఎస్.ఐ,స్టేషన్ అడ్మిన్ ఎస్.ఐ.శివాంగ ప్రసాద్ లచే జర్నలిస్ట్ పారువెల్లి దుర్గ భవాని కు స్త్రీ శక్తి అవార్డు.

తేది:10-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : నాగోల్ డివిజన్ పోలీస్ స్టేషన్‌ ఎస్.హెచ్.ఓ. జానీ,మహిళా ఎస్.ఐ. ఉమ,స్టేషన్ అడ్మిన్ శివాంగ ప్రసాద్ లచే ఫ్రీలాన్స్ పొయట్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ సమక్షంలో,సహకారంతో సామాజిక నేత,జర్నలిస్ట్ భవాని కు ఉత్తమ సేవలకు గాను గ్లోబల్ ఫౌండేషన్ వారి స్త్రీ శక్తి అవార్డు ను ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ జానీ మాట్లాడుతూ పాత్రికేయులు ప్రతి వ్యవస్థలోని కార్యక్రమాలను ప్రజలకు,ప్రపంచానికి తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే సామాజిక సేవల్లో అవార్డు గ్రహిత భవాని ముందుండటం గొప్ప విషయమన్నారు.స్టేషన్ అడ్మిన్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మా చేతులచే జర్నలిస్ట్ భవాని కు అవార్డు ఇవ్వడం సంతోషం గా ఉన్నది.అలాగే పాత్రికేయురాలిగా,సోషల్ వర్కర్ గా, హ్యూమన్ రైట్స్ వుమెన్ వింగ్, సైబర్ సురక్ష సోల్జర్ గా,ఎస్.బి.ఐ ఇన్సూరెన్స్ అడ్వైసరుగా సగటు మానవులకు చేతనైన సహాయం చేయడం అభినందనీయం అని అన్నారు.ఎస్.ఐ. ఉమ మాట్లాడుతూ ఉత్తమ సామాజిక సేవలకు గ్లోబల్ ఫౌండేషన్ గుర్తించి జర్నలిస్ట్ మరియు సామాజిక నేత ఆమె కు స్త్రీ శక్తి అవార్డు మా చేతుల మీదుగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.అలాగే రోజు రోజుకు పురుషులతో సమానంగా పురోగతి చెందుతూ,సేవల్లోను ముందుండడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ఆత్మీయులు,శ్రేయోభిలాషులు అవార్డు గ్రహిత ఆమె కు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *