తేది:10-04-2026 సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫైయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా : మెదపల్లీ గ్రామంలో సర్పంచ్ కొల్లూర్ అరుణ గారి ఆదేశాల మేరకు యువ నాయకులు అభిలాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలకు పంచాయతీ కార్యదర్శి కాంచన రాథోడ్, ఫీల్డ్ అసిస్టెన్స్ శోభారాణి, ఆశావర్కర్ లక్ష్మి, యువకులు బాగప్ప, ఫైయాజ్ ORS (ఓ ర్ స్) గ్లూకోజ్ ప్యాకెట్లు అందించడం జరిగింది.
అనంతరం యువ నాయకులు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శరీరం డిహైడ్రేట్ అవుతుందని, నీరు ఎక్కువ తాగాలని, ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా తొందరగా పని ముగించుకొని చెట్టు నీడకు వెళ్లి కూర్చోవాలని సూచించడం జరిగింది.