ప్రధానోపాధ్యాయుడి వేదింపులతో ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి దుగ్గిళ్ల అక్షయ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం యాదవ సంఘం జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గనవేని మల్లేష్ యాదవ్.

తేది:-10-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామoలో ZPHS ప్రధానోపాధ్యాయులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దుగ్గిళ్ల అక్షయ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని యాదవ సంఘం జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గణవేణి మల్లేష్ యాదవ్ అన్నారు.
ప్రధానోపాధ్యాయులు వేధింపులతో మరణించిన అక్షయ్ కుటుంబానికి న్యాయం చేయాలని, విచారణ చేసి ప్రధానోపాధ్యాయుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన యాదవ సంఘం జిల్లా నాయకులు రెబ్బాస్ మల్లయ్య, బండారి రాంచంద్రం, రాజ మల్లయ్య రాజు, తదితర నాయకులు రాయికల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *