తేది: 07-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAW News రిపోర్టర్ ఫయ్యాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంఘం మండల మెదపల్లీ గ్రామంలో RWS ఏఈ మౌనిక గారు నూతన బోర్‌ను సందర్శించి, నీటిని పరిశీలించి, తగిన సూచనలు చేశారు.
గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ నూతన బోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ మౌనిక గారితో పాటు, గ్రామ సర్పంచ్ కొల్లూర్ అరుణ, ఉప సర్పంచ్ మజర్ అహ్మద్, యువ నాయకులు అభిలాష్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.మెదపల్లీ గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో హర్షం వ్యక్తం చేశారు.