అల్లీపూర్ పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో చిరంజీవి.

తేది:06-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: అల్లీపూర్ గ్రామంలో పల్లె దవాఖానను సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిరంజీవి (MPDO) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో నిర్వహిస్తున్న పలు రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు.
ముఖ్యంగా మందుల నిల్వకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్, రోగులకు పంపిణీ చేస్తున్న మందుల రిజిస్టర్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు అవసరమైన ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుష్మ గ్రామ సర్పంచ్ గౌతమి – వెంకటేష్ పల్లె దావఖాన డాక్టర్ సుప్రియ, ఏఎన్ఎం లత, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *