తేది:05-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAW NEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల పరిధిలోని మెదపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామ పంచాయతీ పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో గ్రామంలో నూతనంగా తాగునీటి బోర్ వేయించారు.
గత కొంతకాలంగా గ్రామంలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సర్పంచ్, తక్షణమే స్పందించి నిధులను కేటాయించి బోర్ వెల్లింగ్ పనులను ప్రారంభించారు. నీరు పడటంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు:
ఉప సర్పంచ్ మజర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి. యువ నాయకుడు అభిలాష్ రెడ్డి, మాజీ స్కూల్ చైర్మన్ సి.హెచ్. లక్ష్మణ్. గ్రామ పెద్దలు: బి. బసంత్ పాటిల్, అశోక్, రచన్న, డాక్టర్ దిగంబర్ రెడ్డి.వార్డు సభ్యులు & యువత: శేఖర్, శీను, భాగప్ప, ఈశ్వర్, అజర్ అహ్మద్, ఖారు పాటిల్, ముజీబ్ పాటిల్, సురేష్, లక్ష్మణ్, బాలు తదితరులు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “గ్రామ అభివృద్ధియే మా ప్రాధాన్యత. ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రోడ్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మెదపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని కోరారు.