నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కి చేరుకుంది.
► ఇప్పటివరకు నలుగురు  కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
► పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌ పాఠాలు
► నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన కార్యక్రమాలు ఉంటాయి. 

తెలంగాణ:
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కు చేరింది.
► ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 11 మంది మృతి చెందారు.   

జాతీయం:
► నేడు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
► ఉదయం11గంటలకు రాజకీయ పక్షాల నేతలతో మాట్లాడనున్న ప్రధాని
► వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు.
► కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చ

► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,311కి చేరింది. 
► దేశంలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా, 468 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *