రజనీకాంత్ కూలీ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులకు రాబోతున్నారు. ఇటీవల జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న రజినీకాంత్ త్వరలోనే కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా త్వరలోనే ట్రైలర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

 

ఆగస్టు 02 న ట్రైలర్ …

 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ టీజర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది ఈ సినిమాతో రజనీకాంత్ మరో బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 2 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తాజాగా సన్ పిక్చర్స్(Sun Pictures) అధికారకంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

 

విలన్ పాత్రలో నాగార్జున?

 

తాజాగా ఈ సినిమా నుంచి “పవర్ హౌస్” అనే పాటను విడుదల చేయగా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సినిమాపై కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ తో పాటు సంజయ్ కీలక పాత్రలలో నటించక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నాగార్జున(Nagarjuna) కూడా ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక సత్యరాజ్, శృతిహాసన్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మోనిక అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

 

ఈ పాటలో పూజా హెగ్డే (Pooja Hegde)తన అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ మొదటిసారి నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చూసిన రజినీకాంత్ లోకేష్ పని తీరుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా మరోసారి కూడా ఆయన డైరెక్షన్లో సినిమా చేయటానికి ఆసక్తి కనబరిచినట్లు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి కానీ ఈ సినిమా సీక్వెల్ లేదని, ఇక ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి కూడా సంబంధం లేదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *