రాజాసాబ్ స్టోరీ చెప్పిన కమెడియన్ సప్తగిరి..!

ప్రముఖ కమెడియన్ సప్తగిరి (Saptagiri ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే.ఈయన ముఖం చూసినా చాలు.. మన ముఖంలో నవ్వు విరాబూస్తుంది. అంతలా తన కామెడీతోనే కాదు.. ఎక్స్ప్రెషన్స్ తో కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఈయన ‘పెళ్లికాని ప్రసాద్’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. సప్తగిరి , ప్రియాంక శర్మ (Priyanka Sharma) నటీనటులుగా, అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. కే.వై.బాబు, భాను ప్రకాష్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ , వైభవ్ రెడ్డి ముత్యాల కలయికలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ముఖ్యంగా తన వంశానికి చెందిన శాసనాల గ్రంథం అనుసరించి పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ ప్రమాణం చేశాడు. అప్పటినుంచి అతడికి పెళ్లి విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మరి పెళ్లయిందా? లేదా? తదితర విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్రభాస్ కెరియర్ లో ‘రాజాసాబ్’ ఒక మైల్ స్టోన్ మూవీ – సప్తగిరి

 

ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుకున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న సప్తగిరి.. అందులో భాగంగానే ‘రాజాసాబ్’ (Raja Saab) సినిమా స్టోరీ గురించి, ప్రభాస్ (Prabhas) క్యారెక్టర్ గురించి గురించి రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సప్తగిరి మాట్లాడుతూ.. “‘రాజాసాబ్’ సినిమా ప్రభాస్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. రాజాసాబ్ కి ముందు 10 సినిమాలు.. రాజాసాబ్ తర్వాత పది సినిమాలు అన్నట్టు ఒక మార్క్ సెట్ చేస్తారు” అంటూ భారీ హైప్ ఇచ్చారు. ఇక ఈయన కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సప్తగిరి మాట్లాడుతూ.. “ప్రభాస్ అన్నతో కలిసి నేను రాజా సాబ్ సినిమాలో చేస్తున్నాను. దాదాపు 100 రోజులపాటు షూటింగ్ పూర్తయింది. అన్నకు నాకు మధ్య మంచి ర్యాపో ఉంది.. నేను చేసిన ఎక్స్ప్రెస్ రాజాకి ప్రభాస్ అన్న చాలా పెద్ద ఫ్యాన్. ఆ సినిమాను థియేటర్లో చూపించాను. ఆ సినిమా తర్వాత బ్రదర్ మీరు నంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పారు .ఇక అప్పటినుంచి అన్నతో మంచి ర్యాపో ఏర్పడింది. అలాగే పెళ్లికాని ప్రసాద్ సినిమా టీజర్ కూడా చూపించాము. పెద్ద హిట్ అవుతుందని అన్న బ్లెస్” చేశారు అంటూ తెలిపారు సప్తగిరి.

 

ప్రభాస్ కామెడీకి మేమే కిందపడి దొర్లాము – సప్తగిరి

 

ఇక రాజా సాబ్ సినిమా ఎలా ఉంది అని ప్రశ్నించగా.. “‘రాజాసాబ్’ సినిమా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రభాస్ అన్నకు సూపర్ హిట్ గ్యారెంటీ. మేము కమెడియన్స్ కదా కానీ ప్రభాస్ అన్న చేసే కామెడీకి మేమే పడి పడి కింద పడి దొర్లుకుంటూ నవ్వాము. కమెడియన్స్ మేము నవ్విస్తాం. కానీ మేము ఎందుకు నవ్వుతాం. అలాంటి మేమే కింద పడి నవ్వాము అంటే ఇక ఆ సినిమాలో అన్న పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.ముఖ్యంగా డైరెక్టర్ మారుతి (Maruti ) ప్రభాస్ ను చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది”అంటూ సప్తగిరి రాజాసాబ్ గురించి చెప్పి భారీ హైప్ తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *