కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఓడిపోయాన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బయట ఎక్కువగా రావడానికి ఆసక్తి చూపలేదు. ఓసారి అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఆయన ఇంతవరకు ప్రశ్నించలేదు. కేసీఆర్‌ ఎప్పుడెప్పుడు అసెంబ్లీ వస్తారా.. ఆయన ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా..? అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.

 

ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 12 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ స్థాయికి ప్రస్తుతమున్న కాంగ్రెస్ నేతలు ఎవరూ సరిపోరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

‘కాంగ్రెస్ నేతలు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది కేసీఆర్ ఆలోచన. ప్రధాని మోదీని మంచోడని వ్యాఖ్యానించక పోతే జైలులో వేస్తారు. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందు పడి కృషి చేసింది మేము.. కానీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడా ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

‘వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. దాసోజు శ్రవణ్ ను 2023 లోనే నామినేట్ చేశాం.. అప్పుడు బీజేపీ ఆపింది. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవటం లేదు. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆయనది నడవటం లేదు. ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసేది ఏమీ లేదు రేవంత్ రెడ్డి. ఈ కార్ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారని భావిస్తున్నా’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

 

‘తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ చేస్తున్న ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. లేని అప్పులు చూపిస్తూ ఎక్కువ మిత్తిని కడుతున్నట్లు ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. కేంద్రతో మంచి సంబంధాలున్న సీఎం తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో వివరించాలి. కాంగ్రెస్ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారు రేసును ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధిస్తారు ?.200 కోట్లు ఖర్చు పెట్టారు ? ఏం లాభం వస్తుంది, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *