‘కామ్రేడ్ కళ్యాణ్’ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..! ఆ డైలాగ్స్ కారణమా..?

టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు థియేటర్లలో ప్రసారమౌతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కామెడీ నేపథ్యంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా శ్రీ విష్ణు సినిమా విషయంలో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా సైతం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇందులో కామెడీ పండించడం కోసం కొన్ని సినిమాల నుంచి రిఫరెన్స్ డైలాగులు వాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan)నటించిన ఆచార్య సినిమాలో నుంచి కూడా కొన్ని డైలాగులను ఉపయోగించారు. ఇందులో భాగంగా.. “నీది ఏ దళం అంటే.. నాది ఆచార్య దళం” అనే డైలాగ్, అలాగే అదెక్కడుంది అంటూ ప్రశ్నించడంతో “ధర్మస్థలికి, పాద ఘటానికి మధ్యలో” ఉందంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగులు సంచలనంగా మారాయి.

సాధారణంగా ఇతర సినిమాలో డైలాగులు వేరొక సినిమాలలో వాడటం సర్వసాధారణం కానీ ఆచార్య సినిమా విషయంలో మెగా అభిమానులు మాత్రం ఇలాంటి వాటిని స్వీకరించలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రాంచరణ్ తో కలిసిన నటించడం మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్నో ట్రోల్స్ ఎదురయ్యాయి.

ఇలా ఆచార్య విషయంలో ఇప్పటికీ మెగా అభిమానులు విమర్శలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలోనే శ్రీ విష్ణు కామెడీ కోసం తన సినిమాలో ఆచార్య సినిమాకు సంబంధించిన డైలాగులను ఉపయోగించిన నేపథ్యంలో ఆచార్య సినిమాపై ఇలాంటి సెటైర్లు వేయడం అవసరమా? అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు పాత గాయాలను మళ్లీ గుర్తు చేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీ విష్ణు నటించిన ఈ సినిమాపై మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ విష్ణు మహిమ నంబియార్ జంటగా నటించగా సీనియర్ నటి రాధిక, షైన్ చాం టాకో, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.