బరువు ఎక్కువగా ఉన్నా పోషకాహార లోపం.. 4,000 మందిపై అధ్యయనంలో షాకింగ్ విషయాలు

రోజూ కడుపునిండా భోజనం చేయడం, శరీరం బొద్దుగా లేదా బరువు ఎక్కువగా ఉండటం చూసి తాము ఆరోగ్యంగా ఉన్నామని చాలామంది భావిస్తారు. అయితే శరీరం బయటికి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ లోపల పోషకాహార లోపం ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 4,000 మందిపై నిర్వహించిన మెటబాలిక్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

అధ్యయనం ప్రకారం బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది శరీరాల్లో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు తగిన స్థాయిలో ఉండటం లేదని గుర్తించారు. కేవలం శరీర బరువు లేదా ఆకారాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే బయటికి బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ అంతర్గతంగా పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు అవసరమైన పోషకాలు శరీరానికి అందుతున్నాయా అనే విషయంపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.