దసరా అంటూ సూపర్ హిట్ సినిమాతో ఏకంగా వంద కోట్లని అందించిన శ్రీకాంత్ ఓదేల పై ఎంతో నమ్మకం తో ప్యారడైజ్ సినిమా చేశాడు నాని.ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ప్యారడైజ్ ఆ సినిమా కాస్తా బొక్క బోర్లా పడింది.దీంతో అందరి మనస్సులో ఒక్కటే. దర్శకుడు శ్రీకాంత్ ఓదేల చిరు కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా వస్తుందా అని .
మిజానికి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక చేసిన ‘ఖైదీ నంబర్ 150’తో సాలిడ్ హిట్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసినవే.ఇక ఎట్టకేలకి బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సౌండ్ చేసింది.
దీంతో చిరు చేయబోయే సినిమాలపై కాస్త ఆచితూచి అడుగులువేస్తూ పోస్తున్నాడు.మన శంకరవరప్రసాద్ గారు ,కాకా వంటి సినిమాలు అలా సెలెక్ట్ చేసుకున్నవే .ఇక ప్యారడైజ్ షూటింగ్ జోరుగా నడుస్తున్న సమయంలో శ్రీకాంత్ ఓడెల చెప్పిన కథ పిచ్చపిచ్చగా నచ్చి ఏకంగా చిరుతో శ్రీకాంత్ ఓదెల కి ప్రాజెక్ట్ సెట్ చేసేశాడు నాని.
అయితే ప్యారడైజ్ అనుకున్నంతగా ఆడకపోవడంతో శ్రీకాంత్ ఓదెల -చిరు కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు మూవీ లవర్స్.అయితే వినిపిస్తున్న వార్తలు బట్టి వీరి మధ్య జరగాల్సిన సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది.ఇక నాని కూడా ఈ సినిమా ఇప్పట్లో లేకపోవచ్చు అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు కూడా.
ఇక వీటికి మరింత ఆజ్యం పోస్తూ శ్రీకాంత్ ఓదెల త్వరలో ఒక క్రేజీ లవ్ స్టోరీని ప్లాన్ చేయబోతున్నాడని,ఇక తనకి అచ్చొచ్చిన తెలంగాణా నేపథ్యంలోనే ఈ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ ఉండబోతుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.మరి నిజంగానే ప్యారడైజ్ రిజల్ట్ కి భయపడ్డ నాని చిరు సినిమాని పక్కన పెట్టేశాడా లేక ఈ సినిమా తర్వాత సెట్స్ మీదకి తీసుకొని వెళ్తాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఒక హిట్టు సినిమా ఎంతటి సౌండ్ చేస్తుందో ,ప్లాప్ సినిమా లైనప్స్ ని ఎలా అతలాకుతం చేస్తాయో అని చెప్పడానికి దసరా, ప్యారడైజ్ సినిమాలని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పక తప్పదు.మొత్తానికి శ్రీకాంత్ ఓడెలకి ఈ సినిమా ఇపుడు డూ ఆర్ డై అని చెప్పకతప్పదు.చూడాలి మరి హంగామాగా అనౌన్స్ చేసిన శ్రీకాంత్ ఓడెల కాంబో సైలెంట్ గా సైడ్ తీసుకుంటుందా లేక మరికొద్ది రోజులు ఆగి ఆన్ బోర్డ్ అవుతుందా !