ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక.. సెప్టెంబర్ 16న గ్రాండ్ లాంచ్

భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు భారీ చిత్రం తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, బివి వర్క్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవం సెప్టెంబర్ 16, 2026న సాయంత్రం 6 గంటలకు చెన్నైలోని ది మ్యూజిక్ అకాడమీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఇండియన్ కోరల్ ఎన్‌సెంబుల్ బృందం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ప్రసిద్ధ గీతాలను లైవ్‌గా ప్రదర్శించనుంది. ఈ వేడుకకు ‘ఎంఎస్ బ్లూ’ డ్రెస్ కోడ్‌గా నిర్ణయించారు.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. సెప్టెంబర్ 16న జరిగే లాంచ్ కార్యక్రమంతో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.