సినిమా నచ్చిందని ప్రేక్షకులు చెప్పడం సాధారణమే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా సినిమా చూసి అభినందించడం హీరో సూరికి ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమా చూసిన రజనీకాంత్.. నేరుగా ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ‘మండాడి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా సూరి నటనతో పాటు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ కూడా సినిమాను చూసి సూరిని అభినందించారు.
రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో తాను ఎంతో ఎమోషనల్ అయ్యానని సూరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన నటనను సూపర్ స్టార్ ప్రశంసించడం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ ఫోన్ కాల్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిగా నిలిచిందని సూరి భావోద్వేగాన్ని పంచుకున్నారు.