వినాయకుడికి ఈ 6 ప్రసాదాలే స్పెషల్.. ఒక్కో నైవేద్యం వెనుక ఒక్కో ప్రత్యేకత!

వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజున మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం గణనాథుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. వినాయకుడికి సమర్పించే ప్రతి ప్రసాదానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు.

వినాయకుడి పూజలో మోదకాలు, ఉండ్రాళ్లు, కుడుములు వంటి సంప్రదాయ ప్రసాదాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటితో పాటు బెల్లం పాయసం, పులిహోర, చలిమిడి-వడపప్పును కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా ప్రసాదాల తయారీ విధానంలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ.. భక్తి, శ్రద్ధతో నైవేద్యం సమర్పించడం ప్రధానంగా భావిస్తారు.

ఈ ఆరు రకాల ప్రసాదాల్లో ఒక్కోదానికి ప్రత్యేకమైన తయారీ విధానం, రుచి, సంప్రదాయ ప్రాధాన్యత ఉంది. మోదకాలు, కుడుములు వంటి వాటిని బియ్యప్పిండి, బెల్లం, కొబ్బరితో తయారు చేస్తారు. ఉండ్రాళ్లు కూడా బియ్యంతో తయారుచేసే సంప్రదాయ వంటకమే. ఇక బెల్లం పాయసం, పులిహోర, చలిమిడి-వడపప్పు కూడా వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను ఎలా తయారు చేయాలి? వాటి ప్రత్యేకత ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.